Corona Effect : శ్రీలంక – భారత్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు
శ్రీలంక - భారత్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు | భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరిస్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ కంటే నాలుగు రోజులు ఆలస్యంగా సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నెల 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగనుంది. ఈ నెల 24న తొలి టీ-20 మ్యాచ్ జరుగనుండగా..

కొలంబో : శ్రీలంక – భారత్ జట్ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ కంటే నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగనుంది. ఈ నెల 24న తొలి టీ-20 మ్యాచ్ జరుగనుండగా.. 25న రెండో మ్యాచ్, 27న మూడో మ్యాచ్ జరుగనుంది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సిరీస్ ఈ నెల 13 తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నది. భారత్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడ్డాయి. ఇటీవల ఇంగ్లండ్‌కు వెళ్లి వచ్చిన టీమ్‌లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారినపడగా.. ఆ తర్వాత టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కు సైతం కరోనా సోకింది. ప్రస్తుతం కరోనా ఇద్దరూ.. చికిత్స పొందుతున్నారని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. అక్కడికి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక టీమ్‌కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. గ్రాంట్ ఫ్లవర్, నిరోషన్ వైరస్ బారినపడ్డట్లు తేలింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

