కర్తవ్య నిర్వహణలో..
రామారావు ముక్కుసూటి మనిషి. ప్రభుత్వ అధికారి అంటే ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నది అతని సిద్ధాంతం. కర్తవ్యనిర్వహణలో అన్యాయాల్ని, అలసత్వాన్ని ఏమాత్రం సహించడు. ఈ క్రమంలో విధి నిర్వహలో అతను ఎదుర్కొన్న సవాళ్లేమిటి? అతని పోరాటం ఎవరితో? అనే అంశాలకు సమాధానమే మా ‘రామారావు ఆన్డ్యూటీ’ చిత్రం’ అన్నారు శరత్ మండవ. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1న టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం కొత్తపోస్టర్ను విడుదల చేశారు. ‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. రవితేజ పాత్ర కొత్త తరహాలో ఉంటుంది. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

