ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలైన యువతరంలో ఎలాంటి దుష్ప్రరిణామాలు కలుగుతున్నాయి అనే కథాంశంతో డి. మహేందర్ రెడ్డి స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్’. రాకేష్, మహి, రవి, సిరి, రుచిత, వెన్నెల తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యచక్ర పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ..‘కొన్ని ఆన్లైన్ గేమ్స్ వల్ల యువత పెడతారి పడుతున్నారు. ఇలా నలుగురు యువకులపై ఆన్లైన్ గేమ్స్ ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించాయి అనేది చిత్రంలో చెబుతున్నాం. త్వరలో సినిమా విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు.