కోల్‌కతాకు చెందిన ఓ సైబర్ నేరగాడు సిమ్‌స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. ఒకటికి మించి అదే నేరంలో చేస్తూ పట్టుబడటంతో అతడిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గత ఏడాది పీడీయాక్ట్ నమోదు చేశారు. పీడీయాక్ట్ నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన విజయ్రావల్, ప్రియాంక మోసాలు చేస్తూ జాబ్ ఫ్రాడ్ కేసులలో పట్టుబడ్డారు. వీరిపైనా కేసు పెట్టారు.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడుతున్నారు. సాధారణంగా శాంతిభద్రతల అంశాలకు సంబంధించిన సెక్షన్ల కింద నమోదైన కేసులలోనే పీడీయాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) నమోదు చేస్తారు. అయితే ఐటీ యాక్ట్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కింద నమోదయ్యే కేసుల్లో ఒకసారి కంటే ఎక్కువ సార్లు అరెస్టు అయ్యే సైబర్ నేరగాళ్లను పీడీయాక్ట్ కింద జైళ్లలో పెట్టవచ్చని పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా ఐటీయాక్ట్ 66(సీ), ఐటీయాక్ట్ 66(డీ), ఐటీయాక్ట్ 67, ఐటీయాక్ట్ 67(ఏ)తోపాటు ఐపీసీ 420 సెక్షన్ల కింద నమోదయ్యే కేసులలో పీడీయాక్ట్ నమోదు చేసే వీలుంటుందని హెచ్చరిస్తున్నారు.
ఐటీ యాక్ట్ సెక్షన్ల కిందా పీడీయాక్ట్‌లు
ఆన్లైన్లో ఎక్కడో ఉండి ఇష్టారీతిన వ్యవహరిస్తాం అంటే కుదరదు. ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు తప్పవు. మోసం చేయడం, కించపర్చేలా, అశ్లీలంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు ఐటీయాక్ట్ 66, 67 కింద కేసు నమోదు చేయవచ్చు. ఈ సెక్షన్ల కింద తరచూ నేరాలకు పాల్పడేవారిపై పీడీయాక్ట్‌లు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.
ఐటీ యాక్ట్ సెక్షన్ 66 సీ:
మన గుర్తింపును ఉపయోగించి ఎలక్ట్రానిక్ సంతకం చేయడం, పాస్వర్డ్లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా వినియోగించడం. ఈ నేరానికి మూడేండ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా.
ఐటీ యాక్ట్ సెక్షన్ 66 డీ:
ఏదైనా కమ్యునికేషన్ డివైజ్ లేదా కంప్యూటర్ను ఉయోగించి మోసగించడం. ఈ నేరానికి మూడేండ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా.
ఐటీ యాక్ట్ సెక్షన్ 67:
కామపూరిత ఉద్దేశంతో ఎవరైన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అశ్లీలంగా ఫొటోలు, వీడియోల రూపంలో ఎలక్ట్రానిక్ రూపంలో ప్రసారం చేయడం, ప్రచురించడం. ఈ నేరానికి మొదటిసారి నేరానికి మూడేండ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, ఇదే నేరాన్ని రెండోసారి, లేదా తరచూ చేస్తే నేరం చేసిన ప్రతిసారి ఐదేండ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.
ఐటీ యాక్ట్ 67 ఏ:
లైంగికంగా వేధించేలా ఉండే ఫొటోలు, వీడియోలు, ఇతర మెటీరియల్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పబ్లిష్ చేయడం లేదా ప్రసారం చేసిన నేరానికి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మొదటిసారి ఈ నేరం చేస్తే ఐదేండ్ల వరకు జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు. ఇదే నేరాన్ని పునరావృతం చేస్తే గరిష్ఠంగా ఏడేండ్ల వరకు జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.