(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సాధారణంగా నిద్రపోయే వ్యవధిలో ఒక గంటపాటు తక్కువ నిద్రించినా.. శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్‌లో వెల్లడించారు. తలనొప్పి, ఏకాగ్రత క్షీణించడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, నిద్రమత్తు, చిరాకు తదితర సమస్యలు పెరుగుతాయని పేర్కొన్నారు. 18 ఏండ్లపై వయస్సు వారు 7 – 9 గంటలు నిద్రపోవాలని తెలిపారు.