14న బహుమతులు ప్రదానం
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సింహప్రసాద్ సాహిత్య సమితి నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ-2026లో బహుమతి పొందిన కథలకు ఈనెల 14వ తేదీన రవీంద్రభారతిలో బహుమతులు అందజేయనున్నదని సమితి కన్వీనర్ సింహప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సింహప్రసాద్ సాహిత్య సమితి నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ-2026లో బహుమతి పొందిన కథలకు ఈనెల 14వ తేదీన రవీంద్రభారతిలో బహుమతులు అందజేయనున్నదని సమితి కన్వీనర్ సింహప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
విశ్వనాథవారి నవలా సాహిత్య సమాలోచనం
హైదరాబాద్‌లోని విశ్వనాథ సాహిత్య పీఠం ఈనెలలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ‘స్వర్గానికి నిచ్చెనలు’, ‘నేపాళ రాజవంశ నవలలు’పై సాహిత్య సమాలోచనం జరుగుందని పీఠం అధ్యక్షుడు డాక్టర్ కొండలరావు వెల్చాల ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నాళేశ్వరం శంకరం, డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి వక్తలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ‘కాశ్మీర రాజవంశ నవలలు’, ‘చిన్నకథలు’పై సాహిత్య సమాలోచనం జరుగుందని తెలిపారు. కోవెల సంతోష్ అధ్యక్షతన జరిగే కార్యక్రమాల్లో కస్తూరి మురళి, ప్రొఫెసర్ లక్ష్మణ చక్రవర్తి వక్తలుగా పాల్గొంటారని తెలిపారు.
దీపావళి కథల పోటీ
డాక్టర్ అమృతలత-పాలపిట్ట సంయుక్తంగా ఈ ఏడాది దీపావళి కథల పోటీ నిర్వహించాలని సంకల్పించిందని పాలపిట్ట ఎడిటర్ గుడిపాటి తెలిపారు. దేశంలోని తెలుగు వారెవరైనా తమ కథలు పంపించవచ్చునని అన్నారు. కథలను ఈ నెల 20వ తేదీలోగా పంపాలని సూచించారు. వివరాలకు 94900 99327లో సంప్రదించాలని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

