గేట్స్ దంపతుల ఆస్తి రూ.11 లక్షల కోట్లు..పంపకాలపై ఊహాగానాలు

వాషింగ్టన్: ప్రపంచ ప్రసిద్ధ కుబేర దంపతులు బిల్, మెలిండా గేట్స్ విడిపోతున్నారనే వార్త ఈసరికే ప్రపంచాన్ని చుట్టేసింది. ఇంతకూ వారు తమ ఉమ్మడి సంపదను ఎలా పంచుకుంటారనే విషయమై ప్రస్తుతం ఊహాగానాలు సాగుతున్నాయి. వారి సంపద ఎంతో తెలుసా? 145 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూపాయలు 11 లక్షల కోట్లు. అంత సంపద సరిసమానంగా పంచుకుంటారా? అంటే సందేహమే. ప్రస్తుతం దీనిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరి అంచనా వారు వెల్లడిస్తున్నారు. ఆ మధ్య అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు జరిగిన ఆస్తి పంపకాలు ప్రపంచవ్యాప్తంగా చర్చాంశమయ్యాయి. బెజోస్ తన ఆస్తిలో 75 శాతం ఉంచుకుని 25 శాతం భార్య మెకంజీ స్కాట్‌కు ఇచ్చేశారు. అమెజాన్‌లోని ఉమ్మడి వాటా నుంచి 16 శాతం స్కాట్‌కు వాటాగా వచ్చింది. దాంతో ఆమె ప్రపంచంలోని నాలుగో సంపన్న మహిళగా స్థానం పొందారు. కానీ గేట్స్ దంపతుల విడాకుల పంపకాలు అంత సరళంగా ఉండకపోవచ్చునని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బెజోస్ తరహాలో పెట్టుబడులన్నీ ఒకేచోట లేకపోవడమే ఇందుకు కారం. పైగా ప్రపంచంలోని అతిపెద్ద ఫౌండేషన్లలో ఒకటైన గేట్స్ ఫౌండేషన్‌కు ఇద్దరూ కలిసే నేతృత్వం వహిస్తున్నారు. దంపతులుగా విడిపోయినా ఫౌండేషన్ మాత్రం కలిసే నడుపుతారట. ఆస్తిలో పెద్దవాటా ఫౌండేషన్‌కే పోతుంది. ప్రస్తుతానికి మటుకు 1.8 బిలియన్ డాలర్లు అంటే రూ.13,500 కోట్ల మేర షేర్లు మెలిండా పేర బదిలీ అయినట్టు నియంత్రణ సంస్థల లెక్కల ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతం గేట్స్ దంపతులు వాషింటగ్టన్ మదీనాలోని తమ ఎస్టేట్ లో ఉంటున్నారు. దాని విస్తీర్ణం 66వేల చదరపు అడుగులు. వాషింగ్టన్ చట్టాల ప్రకారం ఇల్లు మాత్రం భార్యాభర్తలు విడిపోతే చెరిసగం పంచాల్సిందే. ఇకపోతే తమ ముగ్గురు పిల్లలకు ఆస్తిలో వాటా నామమాత్రంగానే ఇస్తామని బిల్ గేట్స్ ఇదివరకే ప్రకటించారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

