High Alert | ఆ నౌకలో ప్రమాదకర కెమికల్స్.. కొచ్చి తీరంలో హై అలర్ట్..!
High Alert | కొచ్చి తీరంలో మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివారం కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది.
High Alert : కొచ్చి తీరంలో మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివారం కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. ఆ నౌక ముందుగా ఒకవైపు ఒరిగిపోయి ఆ తర్వాత మెల్లగా మునిగిపోయింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
మునిగిపోయిన నౌకలో మొత్తం 640 కంటెయినర్లు ఉండగా, వాటిలో 13 కంటెయినర్లలో ప్రమాదకర రసాయనాలు, 12 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు. ఆ రసాయనాలు లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటెయినర్లను గానీ, వాటిలో నుంచి బయటకు వచ్చిన ఇంధనం గానీ తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
సముద్ర జలాల్లో ఇంధనం లీకై ఎంత మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ‘ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ’ ని వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతోందని అధికారులు తెలిపారు. రసాయనాల నౌక మునక కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్సీ ఎల్సా-3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపటి ముందు సముద్రంలో మునిగిపోయింది.
కాగా, కంటెయినర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

