హర్షవర్ధన్ దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సోనాలీ నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలో నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. బుధవారం సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సుధీర్ బాబు రాక్ స్టార్‌గా కనిపిస్తున్నారు. తెలుగు, హిందీలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటున్నది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు వైవిధ్యంగా కనిపిస్తారని చిత్ర బృందం చెబుతున్నారు. కీలక పాత్రల్లో నటించే వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ : రాజీవ్, సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : చేతన్ భరద్వాజ్.