Health tips | ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఈ పంపరపనస పండును ఎప్పుడైనా తిన్నారా..?
Health tips | సాధారణంగా పండు ఏదైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే పండువల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రయోజనాలు కొన్ని పండ్లలో ఎక్కువగా, కొన్ని పండ్లలో తక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పండ్లలో పంపర పనస ఒకటి. ఈ పంపర పనస పండు (Grape fruit) అచ్చం బత్తాయిని పోలి, పరిమాణంలో కొంత పెద్దగా ఉంటుంది.
Health tips : సాధారణంగా పండు ఏదైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే పండువల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రయోజనాలు కొన్ని పండ్లలో ఎక్కువగా, కొన్ని పండ్లలో తక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పండ్లలో పంపర పనస ఒకటి. ఈ పంపర పనస పండు (Grape fruit) అచ్చం బత్తాయిని పోలి, పరిమాణంలో కొంత పెద్దగా ఉంటుంది. పండు లోపల నిమ్మ, నారింజ, బత్తాయిలాగానే తొనలు ఉంటాయి. సిట్రస్ జాతికి చెందిన ఈ పండు కలర్ ఫుల్‌గా కనిపించడమే కాకుండా మంచి ఆరోగ్య లక్షణాలను కూడా కలిగి ఉంది. పంపర పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తి వృద్ధి
పంపర పనసలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఈ పండును తింటుంటే అనారోగ్యాలు దరిచేరవు.
గుండెకు మేలు
పంపర పనసలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సంబంధ సమస్యలు సహజగానే అదుపులో ఉంటాయి. ఇక ఈ పండులోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.
జీర్ణశక్తి మెరుగు
జీర్ణక్రియకు సాయపడే జీర్ణ ఎంజైమ్‌లు కూడా పంపర పనసలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండు తరచూ తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ పండులోని ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.
బరువు అదుపులో
పంపర పనస రుచిలో తియ్యగా ఉన్నప్పటికీ దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తీపి తినాలనే వారికి ఇది తృప్తిని ఇస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు పంపర పనస తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
చర్మం ఆరోగ్యం
ఈ పండులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సాయపడుతాయి. ఈ పండును రెగ్యులర్‌గా తీసుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Banana Leaf | అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఏమవుతుంది..? జీర్ణకోశ నిపుణులు ఏమంటున్నారు..?
Health tips | ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఈ పంపరపనస పండును ఎప్పుడైనా తిన్నారా..?
ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ అక్షాన్ష్ యాదవ్
భద్రాద్రి డీపీఆర్‌ఓపై విచారణకు ఆదేశం
Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

