ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?

హైదరాబాద్: చర్మ సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలకు బయట లభించే క్రీములు వాడడం కంటే ఇంట్లో ఉండే పదార్దాలతో ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయను ముఖానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. నిమ్మకాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.పైగా నిమ్మకాయ వాడడం వల్ల ఎటువంటి సమస్యలు రావు.
ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా పాలు, ఆరెంజ్ తొక్కల పొడి, నిమ్మరసం కలిపి మీ ముఖానికి అప్లై చేసుకుని కొద్దీ సేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మీ చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఇది ముఖానికి నాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది.మీ ముఖం అందంగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మారాలంటే అరటి పండు గుజ్జులో, కొద్దిగా నిమ్మరసం వేసుకుని కలిపి మీ ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేసుకుంటే మీ ముఖహం అందంగా మారుతుంది.
చాలా మంది పొడిబారిన చర్మం వల్ల ఏది వాడాలన్న భయపడుతూ ఉంటారు. అలంటి వారు నిమ్మరసం, తేనే, కొద్దిగా ఉడికించి ముద్దా చేసుకున్న క్యాబేజీ ని బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

