అజర్‌కు హెచ్‌సీఏ షోకాజ్ నోటీసులు

హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, వైరి వర్గం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడన్న కారణంతో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్..అజర్‌కు తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అజర్.. హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజుల్లోగా షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే అసోసియేషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనూరాధా సంతకాలతో అపెక్స్ కౌన్సిల్ అజర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో బీసీసీఐ అనుమతి లేకుండా ఓ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ విషయంలో స్పష్టత లేని వైనం, హెచ్‌సీఏకు చెందిన ఆర్థిక వ్యవహారాలను అడ్డుకోవడం, అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్‌వర్మను నియమిస్తూ వేతనాన్ని నిర్ణయించడాన్ని అపెక్స్ కౌన్సిల్ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

