సౌతాంప్టన్: ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ దుమ్మురేపుతున్నాడు. లాంకషైర్ జట్టు తరపున ఆడుతున్న హసన్ మరోసారి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. సౌతాంప్టన్‌లో డివిజన్ వన్ గేమ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అలీ ఇరగదీశాడు. తొలి రోజు లియామ్ డాసన్, బెన్ బ్రౌన్, కీత్ బార్కర్, కైల్ అబ్బాట్, అబ్బాస్ వికెట్లను తీశాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. హసన్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను కౌంటీ చాంపియన్‌షిప్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. కేవలం 5 ఇన్నింగ్స్‌లో అతను 12.36 సగటుతో 19 వికెట్లు తీశాడు.
Another day, another @RealHa55an 5️⃣ wicket haul ⚡#LVCountyChamp pic.twitter.com/C7pxBIlAMF
— LV= Insurance County Championship (@CountyChamp) April 28, 2022