హరి హర వీరమల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్‌కు అన్ని కోట్లా?
Hari Hara Veeramallu Movie | పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. పీరియాడిక్ యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
Hari Hara Veeramallu Movie | పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా రెండేళ్ళ క్రితమే పట్టాలెక్కిన ఈ చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో చిత్రబృందం ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారు.
కాగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం చిత్రబృందం ఓ భారీ సెట్‌ను రూపొందించారట. అంతేకాకుండా ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే మేకర్స్ దాదాపు రూ.10 కోట్లు ఖర్చుపెట్టనున్నారట. ఇండియాలోని ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్‌లో ఒకటిగా ఈ ఎపిసోడ్ ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

