యూఎస్సీఐఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్, అక్టోబర్ 29: మార్కెట్ రిసెర్చ్ అనలిస్టులను కూడా ప్రత్యేక నైపుణ్యం గల ఉద్యోగులుగా గుర్తించి వారికి హెచ్-1బీ వీసాలను జారీచేసేందుకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అనుమతించింది. దీన్ని కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఫెడెరల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆమోదించింది. ఫలితంగా మార్కెట్ రిసెర్చ్ అనలిస్టులకు కూడా హెచ్-1బీ వీసాలు మంజూరు చేయనున్నారు. భారత్ నుంచి హెచ్-1బీ వీసా కోరేవారిలో ఐటీ నిపుణుల తర్వాత మార్కెట్ రిసెర్చ్ అనలిస్టుల సంఖ్యే ఎక్కువ. మార్కెట్ అనలిస్టులకు హెచ్-1బీ వీసాలు మంజూరు చేయాలని కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్సీఐఎస్ నిర్ణయం కంపెనీలకు గొప్ప విజయం.