వాషింగ్టన్: అమెరికా జిమ్నాస్ట్ సైమోన్ బైల్స్ మెడలో మరో అరుదైన మెడల్ వచ్చి చేరింది. జిమ్నాస్టిక్స్ లో అత్యధిక మెడల్స్‌తో చరిత్ర సృష్టించిన అథ్లెట్ సైమోన్ బైల్స్‌కు అమెరికా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసింది. ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడంను ఆమె అందుకున్నది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ మెడల్‌ను ఆమెకు అలంకరించారు. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్‌ను అందజేశారు. ఫ్రీడం మెడల్‌ను అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా బైల్స్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది మొత్తం 17 మందికి ఫ్రీడం మెడల్‌ను బహూకరించారు. టెక్సాస్‌లోని స్ప్రింగ్‌కు చెందిన బైల్స్ ఏడుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నది. అథ్లెట్లలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే రీతిలో ఆమె ప్రచారం నిర్వహించింది. ఆమె ఖాతాలో 32 మెడల్స్ ఉన్నాయి.