Guns & Gulaabs | ‘గన్స్ అండ్ గులాబ్స్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Guns & Gulaabs | మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు (Raj kumar rao) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సరికొత్త వెబ్‌సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ (Guns & Gulaabs). ఇక ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన హిందీ ట్రైలర్‌ను గత బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Guns & Gulaabs | ‘మహనటి’, సీతారామం చిత్రాలతో తెలుగువారికి చేరువైన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). స్త్రీ, మోనికా, ఓ మై డార్లింగ్ (Monica Oh My Darling) లాంటి మూవీలతో హిట్ కొట్టిన రాజ్ కుమార్ రావు (Raj kumar rao) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సరికొత్త వెబ్‌సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ (Guns & Gulaabs). ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన హిందీ ట్రైలర్‌ను గత బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. ఈ వెబ్ సిరీస్‌లో స్టైలిష్ పోలీసుగా కనిపించనున్నారు దుల్కర్ సల్మాన్. ఈ స్టార్ హీరోకు ఇదే మొదటి వెబ్ సిరీస్. గులాబ్ గంజ్ అనే ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగిన పోరాటం ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్‌ను రూపొందించినట్లు ట్రైలర్ చుస్తే తెలిసిపోతుంది. పాన టిప్పు అనే పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా రాజ్ కుమార్ రావు అలరించనున్నాడు.
‘ద ఫ్యామిలీమ్యాన్’ (The Family Man), ‘ఫర్జీ’ (Farzi) లాంటి వెబ్ సిరీస్‌లతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకులు రాజ్ అండ్ డీకే (Raj & Dk) ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. డీ2ఆర్ ఫిల్మ్స్; నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆదర్శ్ గౌరవ్, గుల్షన్ దేవయ్య, గౌతమ్ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగష్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

