జేఎన్టీయూ వీసీపై గవర్నర్ సీరియస్
జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) వీసీ టీకేకే రెడ్డి వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సీరియస్ అయ్యారు.
- వీసీపై లోక్‌భవన్‌కు ఫిర్యాదుల వెల్లువ
- ఆరా తీసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- అగ్రికల్చర్ వర్సిటీ వ్యవహారంపైనా ఆరా
- సమగ్ర నివేదిక సమర్పించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) వీసీ టీకేకే రెడ్డి వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సీరియస్ అయ్యారు. ఆయనపై లోక్‌భవన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులొస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకు యూనివర్సిటీలో ఏం నడుస్తున్నది? ఇంత పెద్దఎత్తున ఫిర్యాదులు రావడమేంది? అంటూ ఆరా తీశారు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాయల వీసీపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీడియాలో, పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు, వార్తలు రావడంపై మండిపడ్డారు.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని శుక్రవారం లోక్‌భవన్‌కు పిలిపించిన గవర్నర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జేఎన్టీయూహెచ్, అగ్రికల్చర్ యూనివర్సిటీపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయా అంశాలపై వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. త్వరలోనే వీసీలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి విద్యా, పరిపాలనా అంశాలపై చర్చిస్తానని చెప్పారు.
జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇటీవల అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రతి విషయంలో ఓ మహిళా అధికారి వేలుపెడుతున్నారట. సెటిల్మెంట్లు చేస్తున్నారట. పెండిం గ్ బిల్లుల విడుదలకు 10శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు ఆరోపణలొచ్చాయి. దాదాపు 33 బిల్లులు క్లియర్ చేసేందుకు భారీగా పర్సంటేజీలు పుచ్చుకున్నారట.
సెక్యూరిటీ టెండర్లపై హైకోర్టులో పిల్
వర్సిటీలో సెక్యూరిటీ టెండర్లలో అవినీతి వ్యవహారం హైకోర్టుకు చేరింది. సెక్యూరిటీ టెండర్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని.. దాదాపు రూ.6 కోట్లకు టెండర్ పెట్టినట్టు పరిశోధక విద్యార్థి జవ్వాజి దిలీప్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ అవినీతిపై న్యాయ విచారన జరుపాలని, వీసీ టీకేకే రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని, రూ.6 కోట్లను రికవరీ చేయాలని పిల్ ద్వారా అభ్యర్థించారు. వీసీ వర్సిటీని ఏటీఎంగా వాడుకుంటున్నారని, విద్యాశాఖ అధికారులు కమిటీ వేసి సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరుపాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

