Home
National
Thieves Steal Gold And Diamond Jewellery Worth ₹10 Crore From Kisna Showroom In Madhya Pradesh
‘కిస్నా’ షోరూమ్‌లో 10 కోట్ల విలువైన నగల చోరీ
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో దొంగలు రూ.10 కోట్ల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున దుండగులు కట్నీ నగరంలోని కిస్నా బంగారు నగల షోరూమ్ వెనక గోడకు గ్యాస్ కట్టర్‌తో రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో దొంగలు రూ.10 కోట్ల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున దుండగులు కట్నీ నగరంలోని కిస్నా బంగారు నగల షోరూమ్ వెనక గోడకు గ్యాస్ కట్టర్‌తో రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. బంగారు, వజ్రాల ఆభరణాలను భద్రపరిచే సేఫ్‌లను కట్ చేసి అందులోని రూ.10 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు.
ఈ చోరీలో ఆరుగురు దొంగలు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీపావళి నేపథ్యంలో తన షాపులో ఎక్కువ నగలు ఉంచినట్టు షోరూమ్ యజమాని వాపోయారు. ఇటీవల మధురైలో తనిష్క్ నగల దుకాణంలో కూడా ఇదే తరహా దొంగతనం జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

