ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించిన గూగుల్..
హైదరాబాద్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. "పే పాస్ సబ్స్క్రిప్షన్ " సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో ఆండ్రాయిడ్ డివైస్ లకు నెలకు రూ. 99లు, సంవత్సరానికి రూ. 889కి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది గూగుల్.
హైదరాబాద్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. “పే పాస్ సబ్స్క్రిప్షన్ ” సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో ఆండ్రాయిడ్ డివైస్ లకు నెలకు రూ. 99లు, సంవత్సరానికి రూ. 889కి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. గూగుల్ ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ను నెలకు రూ.99 చెల్లించి పొందవచ్చు. ఏడాదికి అయితే రూ.889 అవుతుంది. అదే ప్రీపెయిడ్ పద్ధతిలో అయితే నెలకు రూ.109 చెల్లించాలి.
అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఈ సర్వీస్‌ను తమ కుటుంబ సభ్యులతో కలిసి షేర్ చేసుకోవచ్చు. 5 మందికి ఈ సర్వీస్‌ను షేర్ చేయవచ్చు. గూగుల్ ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ను పొందాలంటే ప్లే స్టోర్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో కుడి వైపు పైభాగంలో ఉండే ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. అనంతరం ప్లే పాస్ పై ట్యాప్ చేయాలి. ఇక అందులో ఉండే సబ్స్క్రిప్షన్ సర్వీస్ ను నిర్దిష్టమైన రుసుము చెల్లించి పొందవచ్చు.
గూగుల్ భారత్‌లో తన ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా యూజర్లు నెలకు రూ.99 చెల్లిస్తే.. గేమ్స్ లేదా యాప్స్‌ను యాడ్స్ లేకుండా, ఇన్ యాప్ పర్చేసెస్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలను గూగుల్ 2019లో అమెరికాలో ప్రారంభించింది. తరువాత పలు ఇతర దేశాలకు ఈ సేవలను విస్తరించింది. ఇక తాజాగా భారత్‌లోనూ ఈ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ 90కి పైగా దేశాల్లో లభిస్తోంది.
ఈ సర్వీస్‌లో భాగంగా 41 విభాగాల్లోని వెయ్యికి పైగా యాప్స్, గేమ్స్‌ను యూజర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో యాడ్స్ రావు. అలాగే కొన్నింటిలో సేవలను పొందాలంటే ఇన్ యాప్ పర్చేసెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కనుక యూజర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గూగుల్ తెలియజేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- access
- android devices
- apps
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

