హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ ఓపెన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ట్రెజరీస్ & అకౌంట్స్ గెజిటెడ్ యూనియన్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్ పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల 74 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ప్రదీప్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రదీప్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు విధులు నిర్వహిస్తూ క్రీడల్లో రాణించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీస్ & అకౌంట్స్ గెజిటెడ్ యూనియన్ హైదరాబాద్ అధ్యక్షుడు సుధీర్, వేలాద్రి, దస్రు తదితరులు పాల్గొన్నారు.