లక్ష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. ఇషాన్ సూర్య దర్శకుడు. పద్మావతి చదలవాడ నిర్మాత. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హీరో లక్ష్ కెరీర్లో వైవిధ్యమైన చిత్రమిది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి జయసుధ తనయుడు నిహార్‌కపూర్ విలన్‌గా పరిచయమవుతున్నాడు. లవ్, యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలను మేళవించి రూపొందిస్తున్న చిత్రమిది’ అన్నారు.