కరోనాతో కొత్త ముప్పు.. భారత్‌లో తొలిసారి గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ కేసులు
Gall Bladder Gangrene: కరోనా వైరస్‌తో మరో కొత్త ముప్పు దాపురించింది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ అనే కొత్త వ్యాధి వస్తున్నది. భారత్‌లోనూ ఇవాళ తొలిసారిగా గాల్‌బ్లాడర్ గాంగ్రిన్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో మరో కొత్త ముప్పు దాపురించింది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ అనే కొత్త వ్యాధి వస్తున్నది. భారత్‌లోనూ ఇవాళ తొలిసారిగా గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి కోలుకున్న ఐదుగురిలో ఈ వ్యాధి బయటపడటం ఆందోళన కలిగిస్తున్నది. 37 నుంచి 75 ఏండ్ల మధ్య వయసున్న నలుగురు పురుషులు, ఒక మహిళకు ఈ వ్యాధి సోకింది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఐదుగురూ ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య కరోనా నుంచి కోలుకున్నారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ అనిల్ ఆరోరా ఈ వ్యాధి వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ”వాంతులు, జ్వరం, ఉదరం కుడి భాగంలో నొప్పి వంటి లక్షణాలతో కొందరు ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు చేయగా గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ అని తేలింది. ప్రస్తుతం ఈ ఐదుగురు రోగులకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం. గాల్‌బ్లాడర్‌లో వాపు అనేది ఉత్తర భారతదేశంలో సాధారణమైన అంశం. ఈ వ్యాధిని కోలిసైస్టిటిస్ అని పిలుస్తారు. సాధారణంగా 10 శాతం మందికి అకాల్య్కులస్ కోలిసైస్టిటిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఫలితంగా ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉదరంలో నొప్పి తలెత్తుతుంది” అని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

