ఇదేం పద్ధతి : ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు చెంపదెబ్బ, ఇద్దరు అరెస్టు
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై మంగళవారం ప్రేక్షకులు చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి

పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై మంగళవారం ప్రేక్షకులు చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అధ్యక్షుడిపై ఎందుకు చేయి చేసుకున్నారో, వారెవరో అన్న విషయాలు ఇప్పటివరకు ఇంకా వెల్లడికాలేదు. ఈ సంఘటన దక్షిణ ఫ్రాన్స్‌లో మాక్రాన్ నడుస్తూ వెళ్తున్న సందర్భంలో జరిగింది. మాక్రాన్ డ్రెమ్ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మాక్రాన్ అక్కడి రెస్టారెంట్ యజమానులు, విద్యార్థులను కలిశారు. కొవిడ్ అనంతర జీవితం ఎలా సాధారణ స్థితికి చేరుకుంటుందో వారితో మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా అధ్యక్షుడిపై చేయిచేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన గార్డులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని భద్రతా బలగాలకు అప్పగించారు.
అధ్యక్షుడిని చెంపదెబ్బ కొట్టిన సంఘటనను స్థానిక రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం అంటే చర్చ, చట్టబద్ధమైన అసమ్మతి తెలుపడం అంతేకానీ, ఇలా చేయిచేసుకోవడం పద్ధతి కాదని ఫ్రెంచ్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత జాతీయ అసెంబ్లీకి చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింస, శారీరక దాడులు ఉండకూడదన్నారు. ఈ విషయంపై అధ్యక్షుడికి సంఘీభావం తెలిపేందుకు ఫార్ లెఫ్ట్ నాయకుడు జీన్ లూక్ మెలెన్‌చాన్ ట్వీట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్థానిక బ్రాడ్కాస్టర్లు తెలిపారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మాక్రాన్ అక్కడ గుమిగూడిన వారిని పలకరిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ఆకుపచ్చ టీ-షర్టు, కండ్లద్దాలు, ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తిని పలకరించడానికి మాక్రాన్ చేయి చాచాడు. అయితే, “డౌన్ విత్ మాక్రోనియా” అని సదరు వ్యక్తి అరుస్తూ మాక్రాన్‌కు చెంపదెబ్బ కొట్టాడు. దాడి చేసిన వ్యక్తి “మోంట్జోయి సెయింట్ డెనిస్” అని అరవడం వీడియోలో వినిపించింది. ఇది ఫ్రాన్స్ రాచరికం సమయంలో ఫ్రెంచ్ సైన్యం యుద్ధ నినాదం అని నిపుణులు పేర్కొన్నారు. మాక్రాన్‌పై దాడి చేసే ప్రయత్నం జరిగిందని ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. అయితే ఎవరు దాడి చేసింది, ఎందుకు చేశారు అనే విషయాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు.
ఇవి కూడా చదవండి..
యూఎస్ నివేదిక : పెంటగాన్దే అతి పెద్ద ఇంటెలిజెన్స్ ఫోర్స్
తప్పుడు అఫిడవిట్లు : జైలుశిక్ష పెంచాలని సీఈసీ లేఖ
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్‌లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
బాబోయ్ ఎండలు : దుబాయ్‌లో మండుతున్న సూరీడు
మరింత శక్తి : వచ్చే నెలలో భారత్‌కు అమెరికా సీహాక్ హెలీకాప్టర్స్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
రిత్రలో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామకరణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

