కాన్బెరా: ఒకప్పుడు న్యూజిలాండ్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఉన్న ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ( Chris Cairns ) ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరాలోని హాస్పిటల్లో కెయిన్స్‌కు చికిత్స అందిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యతో కెయిన్స్ బాధపడుతున్నాడు. ఇప్పటికే అతనికి పలు సర్జరీలు నిర్వహించినా ఆశించిన ఫలితం రాలేదు. శరీరంలోని ప్రధాన గుండె నాళంలో చీలిక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
మెరుగైన చికిత్స కోసం అతన్ని సిడ్నీలోని హాస్పిటల్‌కు తరలించే అవకాశం ఉన్నదని ఓ రిపోర్ట్ వెల్లడించింది. అతని ఆరోగ్యంపై న్యూజిలాండ్ ప్లేయర్స్ అసోసియేషన్ స్పందించలేదు. 90ల్లోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరుగాంచిన క్రిస్ కెయిన్స్ న్యూజిలాండ్ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.