తేజా సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న సూపర్‌హీరో చిత్రం ‘హను-మాన్’. అమృతఅయ్యర్ కథానాయిక. ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అంజమ్మగా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చేతిలో కొబ్బరికాయల గుత్తితో కోపంగా చూస్తూ కనిపిస్తున్నారామె. వధువు వస్త్రధారణలో ఆమె లుక్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘ఇండియన్ స్క్రీన్‌పై తొలి సూపర్‌హీరో చిత్రమిది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల చేస్తాం. దుష్టశిక్షకురాలిగా అంజమ్మ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: అనుదీప్, హరిగౌరా, జైక్రిష్, కృష్ణసౌరభ్, నిర్మాణ సంస్థ: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.