Zomato | జొమాటోకు గుడ్ బై చెప్పిన మోహిత్ గుప్తా
వారం రోజుల వ్యవధిలో జొమాటోను వీడిన ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న మోహిత్ గుప్తా గుడ్ బై చెప్పారు. నాలుగున్నరేళ్లు కంపెనీతో కొనసాగిన ఆయన శుక్రవారం రాజీనామా చేశారు. కంపెనీకి గుడ్ బై చెప్పినప్పటికీ తాను జొమాటోలో ముదుపరుడిగా ఉంటానని తన రాజీనామా లెటర్లో మోహిత్ వెల్లడించారు. కో-ఫౌండర్‌గా ఉన్న మోహిత్ జొమాటోను వీడడం కంపెనీకి ఎదురుదెబ్బ. ఎందుకంటే.. వారం రోజుల వ్యవధిలోనే జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులు ముగ్గరు రాజీనామా చేశారు. జొమాటో న్యూ ఇనిషియేటివ్ హెడ్ రాహుల్ గంజూ, జొమాటోస్ ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ ఝావర్లు వారం రోజుల వ్యవధిలోనే కంపెనీకి గుడ్ బై చెప్పారు.
జొమాటోలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మోహిత్ తన పనితీరుతో 2020లో కో-ఫౌండర్ స్థాయికి ఎదిగారు. ‘నేను నాలుగున్నర ఏళ్ల కింద జొమాటోలో చేరాను. ఈ సంస్థను మనదేశంలోనే బెస్ట్ ఫుడ్ టెక్ కంపెనీగా మార్చాలనే లక్ష్యంతో పనిచేశాను. ఇతర ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి పోటీ ఎదురైనా, ప్యాండెమిక్ టైంలో నష్టాలు వచ్చినా కూడా మళ్లీ లాభాల బాటలో నడిచాం’ అని మోహిత్ అన్నారు. జొమాటోను 2008లో దీపిందర్ గోయల్ పంకజ్ చద్దా ప్రారంభించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

