న్యూయార్క్: మొగల్-ఏ-ఆజమ్ చిత్రంలోని జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఆ పాటతో ఫ్లాష్ మాబ్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ సాంగ్‌పై డ్యాన్స్ చేశారు. మొగల్-ఏ-ఆజమ్.. ద మ్యూజికల్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను వచ్చ నెలలో న్యూయార్క్‌లో నిర్వహించనున్నారు. అయితే ప్రమోషన్ కోసం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకున్నది. అనార్కలీ సూట్లు ధరించిన మహిళలు.. గ్రూప్ డ్యాన్స్ చేస్తూ కనువిందు చేశారు. ప్యార్ కియాతో డర్నా క్యా అంటూ స్టెప్పులేశారు. ఈ షోను అమెరికా, కెనడాల్లో నిర్వహించనున్నారు.