ఫైనల్ ఫైట్
- మెగాటోర్నీలో పరాజయం అన్నదే
- ఎరుగకుండా దూసుకెళ్తున్న జట్టు ఓ వైపు..
- ఆరంభంలో కాస్త ఇబ్బందిపడ్డా..
- ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో అజేయంగా
- నిలిచిన జట్టు మరోవైపు..
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టైటిల్ పోరుకు సై అంటున్నాయి!
మరి ఏడోసారి కప్పు పట్టి ఆసీస్ చరిత్ర లిఖిస్తుందా.. లేక ఇంగ్లండ్ అమ్మాయిలు పాంచ్ పటాకా మోగిస్తారా చూడాలి!!
క్రైస్ట్‌చర్చ్: నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ఆదివారం తెరపడనుంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మధ్య ఆదివారం ఫైనల్ ఫైట్ జరుగనుంది. ఇప్పటి వరకు పదకొండుసార్లు ప్రపంచకప్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరుసార్లు టైటిల్ చేజిక్కించుకోగా.. ఇంగ్లండ్ నాలుగు ట్రోఫీలతో రెండో స్థానంలో ఉంది. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఇరు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శనతో తుదిపోరుకు అర్హత సాధించాయి. అలీసా హీలీ, హైన్స్, లానింగ్, మూనీ, తహిలా, పెర్రీ, గార్డ్నర్తో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా కనిపిస్తుంటే.. ఇంగ్లండ్ టాపార్డర్ బ్యూమౌంట్, వ్యాట్, హీతర్ నైట్, స్కీవర్, జోన్స్, సోఫియాతో పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ ఇరు జట్ల వద్ద తగినన్ని వనరులు అందుబాటులో ఉండటంతో ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి. పదకొండు ప్రపంచకప్‌లలో పదింటిని తమ ఖాతాలో వేసుకున్న ఈ రెండు జట్లు.. 34 ఏండ్ల తర్వాత తొలిసారి ఫైనల్లో తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా 1988లో వరల్డ్‌కప్ ఫైనల్ జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Alyssa Healy
- Hines
- Lanning
- Mooney
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

