కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సెబాస్టియన్ పీసీ 524’. కోమలీ ప్రసాద్, సువేక్ష నాయికలుగా నటిస్తున్నారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. మార్చి 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘ఈ కథలో కథానాయకుడికి రేచీకటి. అతను పోలీస్ కావాలని తండ్రి కోరుకుంటాడు. రేచీకటి ఉందని ఎవరికీ తెలియనీయకు, వాళ్లు నీపై జాలి చూపిస్తే నేను భరించలేను అంటుంది తల్లి. అలా తండ్రి కల, తల్లి ఆజ్ఞ మేరకు కథానాయకుడు ఎలా తన జీవితంలో అనుకున్నది సాధించాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు.