కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
చండూరు మండలం కస్తాల గ్రామంలో రైతులు విద్యుత్ అధికారులపై తిరగబడ్డారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కస్తాల గ్రామంలోని సబ్ స్టేషన్ ముందు శుక్రవారం నిరసనకు దిగారు. పొలాల్లో పని వదిలేసి పెద్ద సంఖ్యలో రైతులు సబ్ స్టేషన్ ముందు...
చండూరు, అక్టోబర్ 16 : చండూరు మండలం కస్తాల గ్రామంలో రైతులు విద్యుత్ అధికారులపై తిరగబడ్డారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కస్తాల గ్రామంలోని సబ్ స్టేషన్ ముందు శుక్రవారం నిరసనకు దిగారు. పొలాల్లో పని వదిలేసి పెద్ద సంఖ్యలో రైతులు సబ్ స్టేషన్ ముందు బైఠాయించి తమ ఆవేదనను వినిపించారు. చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు పండించాలని ఆశతో పొలాల్లోకి దిగిన రైతులు కరెంటు లేక తమ కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే ఏమీ చేయలేక కన్నీరు పెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పంట చేతికి వచ్చే కీలక సమయంలో నీరు అందకపోతే రైతు జీవితమే నాశనం అవుతుందని, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడం వల్ల అప్పుల పాలవుతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇచ్చే కరెంటు పంటలకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరి, పత్తి, కూరగాయ పంటలు నీరు లేక వాడిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే పంట చేతికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రోజుకు 12 గంటల కరెంటు ఇవ్వాలని, అది కూడా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని కోరుతున్నారు. పలుమార్లు పై అధికారులకు విన్నవించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు శుక్రవారం సబ్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. “మాకు 12 గంటల కరెంటు కావాలి”, “రైతులను కాపాడండి”, “పంటలు ఎండిపోతున్నాయి అంటూ నినాదాలు చేశారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని, అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కస్తాల, మెండువారిగూడెం, గోపిడి వారి గూడెం, ఉడతల పల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

