కొండాపూర్‌లో నకిలీ బాండ్ల తయారీ

అకాడమీ నిధుల కాజేతకు ఏడాదిగా స్కెచ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేసిన ముఠా.. ఇందుకోసం 43 నకిలీ బాండ్లను కొండాపూర్‌లో తయారుచేసినట్టు విచారణలో తేలింది. అసలైన ఎఫ్డీ బాండ్లను తమ వద్ద ఉంచుకొన్నట్టు వెల్లడయింది. నకిలీ బాండ్ల తయారీలో తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన పద్మనాభన్, హైదరాబాద్‌కు చెందిన మదన్ కీలక వ్యక్తులని పోలీసులు తేల్చారు. ఇందులో పద్మనాభన్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు. నకిలీ బాండ్లను తయారుచేయించింది మాత్రం ప్రధాన సూత్రధారి సాయికుమార్. నకిలీ బాండ్ల తయారీ కోసం పద్మనాభన్, మదన్ కొండాపూర్ సైబర్రిచ్ అపార్టుమెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. పద్మనాభన్ తమిళనాడు వెళ్లినప్పుడు అక్కడినుంచి కూడా నకిలీ బాండ్లు తయారుచేసి కొరియర్లో పంపించేవాడు. అకాడమీ ఎఫ్డీలు కాజేసేందుకు సాయికుమార్ ముఠా సంవత్సరం పాటు స్కెచ్ వేసింది. అకాడమీకి, బ్యాంకులకు ఏజెంట్లుగా వ్యవహరించిన వారి గురించి ఆరా తీసింది. భూపతిరావు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతాడనే విషయం తెలుసుకుని అతన్ని బుట్టలో వేసుకున్నది. సాయికుమార్ ముఠా.. అకాడమీకి వెళ్లిన సమయంలో తాము బ్యాంకు అధికారులమని, బ్యాంకులకు వెళ్లిన సమయంలో తాము అకాడమీ అధికారులమని నమ్మించింది. అందరినీ ముఠాలో చేర్చుకుని ఫిక్స్డ్ డిపాజిట్లు సులువుగా కొట్టేసిందని విచారణలో వెల్లడయింది. అకాడమీ నిధుల స్కాం కేసులో కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన కస్టడీ కొనసాగుతున్నది. తన వాటాగా వచ్చిన రూ.2 కోట్లతో ఆస్తులు కొన్నట్టు వెల్లడించడంతో ఆయా ఆస్తుల పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fake bonds
- Telugu Akademi
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

