MP vs MLA | దండేపల్లి: కాంగ్రెస్ (Congres) పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేల వర్గపోరు మండలంలోని గూడెం గ్రామంలో బయటపడింది. ఎంపీ (MP) కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే (MAL) వర్గీయులు చించివేసి వర్గపోరుకు తెరలేపారు. దండేపల్లి మండలంలోని గూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన వర్గీయులు ఫ్లెక్సీ (Flexi)ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న ఎంపీ వంశీని అడ్డుకోవాలని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన వర్గీయులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎంపీని అడ్డుకోవడానికి వచ్చిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎంపీ ఫ్లెక్సీని చించివేశారు.