లైఫ్ అంటే ఇట్లా ఉండాలా!
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’.అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్ కథానాయికలు. పూజాహెగ్డే ఐటెంసాంగ్‌లో నర్తించింది. పార్టీ థీమ్‌తో ఈ పాటకు రూపకల్పన చేశారు. ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా..’ అనే పల్లవితో సాగే ఈ పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్, వరుణ్‌తేజ్, పూజాహెగ్డే నవ్వులు చిందిస్తూ పార్టీ జోష్‌తో కనిపిస్తున్నారు. ‘ఈ పాట కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్‌ను సిద్ధం చేశారు. ఈ గీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. చిత్ర తారాగణం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, నిర్మాత: శిరీష్, సమర్పణ: దిల్‌రాజు, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

