పుణె: భారత్‌తో తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేలో బరిలోకి దిగేది అనుమానంగా మారింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. మోర్గాన్‌కు తన కుడి బొటనవేలు, చూపుడు వేలు మధ్య గాయం కావడంతో నాలుగు కుట్లు కూడా వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. మరోవైపు బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్ డైవ్ చేయగా ప్రమాదకరంగా తన భుజం గ్రౌండ్‌కు తాకడంతో భుజం పైభాగం కాలర్‌బోన్‌కు గాయమైంది.