Ecuador | ఈక్వెడార్ నౌకలను సముద్రంలో ముంచిన అమెరికా దళాలు..!
Ecuador | తూర్పు పసిఫిక్ సముద్ర జలాల్లో అమెరికా సైనిక దళాలు (US forces) సంచలన ఆపరేషన్ చేపట్టాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరిస్తున్నాయనే ఆరోపణలపై ఈక్వెడార్ (Ecuador) కు చెందిన పలు వాణిజ్య నౌకల (Trade ships) ను అడ్డగించి, సముద్రంలోనే ముంచివేశాయి.
Ecuador : తూర్పు పసిఫిక్ సముద్ర జలాల్లో అమెరికా సైనిక దళాలు (US forces) సంచలన ఆపరేషన్ చేపట్టాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరిస్తున్నాయనే ఆరోపణలపై ఈక్వెడార్ (Ecuador) కు చెందిన పలు వాణిజ్య నౌకల (Trade ships) ను అడ్డగించి, సముద్రంలోనే ముంచివేశాయి. అయితే నౌకలను ధ్వంసం చేయడానికి ముందే వాటిలోని సిబ్బందిని సురక్షితంగా ఈక్వెడార్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇరుదేశాల అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఈ ఆపరేషన్ జరిగినట్లు యూఎస్ సదరన్ కమాండ్ వెల్లడించింది. డ్రగ్స్ స్మగ్లర్లు సముద్రంలో ఏర్పాటు చేసుకున్న “తేలియాడే ఫ్యూయల్ స్టేషన్లను” లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నది. యూఎస్ఎస్ శాన్ ఆంటోనియో యుద్ధనౌక నుంచి బయలుదేరిన హెలికాప్టర్లు, సిబ్బందిని ఖాళీ చేయించిన తర్వాత నౌకలపై ఆయుధాలు ప్రయోగించి వాటిని ధ్వంసం చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అమెరికా సైన్యం విడుదల చేసింది.
ఈ ఫ్యూయలింగ్ కేంద్రాలకు ఈక్వెడార్‌కు చెందిన ‘లాస్ చోనెరోస్’ అనే నేర ముఠాతో సంబంధాలున్నాయని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను అమెరికా ఇప్పటికే విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇలాంటి తేలియాడే ఫ్యూయల్ స్టేషన్ల ద్వారా చిన్నచిన్న స్పీడ్ బోట్లకు ఇంధనం నింపి, వాటి ద్వారా మాదకద్రవ్యాలను ఉత్తర అమెరికా దేశాలకు తరలిస్తున్నారని ఈక్వెడార్ అంతర్గత వ్యవహారాల మంత్రి జాన్ రీంబెర్గ్ వివరించారు.
గత ఏడాది కాలంగా అమెరికా చేపడుతున్న ‘ఆపరేషన్ సదరన్ స్పియర్’ లో భాగంగా జరిగిన నాలుగో ఆపరేషన్ ఇది. ఈ సుదీర్ఘ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 70కి పైగా నౌకలను ధ్వంసం చేయగా.. 220 మందికిపైగా మరణించినట్లు అంచనా. అయితే తాజా ఘటనలో ప్రాణనష్టం జరగకుండా సిబ్బందిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. సుమారు 28 మంది సిబ్బందిని మాంటా పోర్టులో తమకు అప్పగించినట్లు ఈక్వెడార్ అధికారులు తెలిపారు.
మరోవైపు నౌక సిబ్బంది బంధువులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. వారు కేవలం మత్స్యకారులని, వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని వాదిస్తున్నారు. అయితే నేర ముఠాల లాజిస్టిక్స్‌ను దెబ్బతీయడానికే ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టామని ఇరుదేశాల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

