ద్రౌపది నా ఫెవరేట్ క్యారెక్టర్: రామ్‌గోపాల్ వర్మ
హైదరాబాద్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఫిల్మ్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే అప్పుడు పాండవులు ఎవరు, అంతకన్నా ముఖ్యంగా కౌరవులు ఎవరు అని తన ట్వీట్లో వర్మ ప్రశ్నించారు. గిరిజన తెగకు చెందిన ముర్ముపై వర్మ వివాదాస్పద కామెంట్ చేశారని, ఆయనపై కేసు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ వర్మ రెండు ట్వీట్లు చేశారు. రాజకీయవేత్తలు వెన్నుపోటు పొడవడంలో బిజీగా ఉన్నారని, ఒకర్ని ఒకరు లాగేసుకుంటున్నారని, అలాంటప్పుడు ప్రజల సమస్యల్ని పరిష్కరించే సమయం వాళ్లకు ఎక్కడ ఉంటుందని వర్మ తన ట్వీట్లో ప్రశ్నించారు.
ఇక ద్రౌపది ముర్ము కామెంట్‌పై కూడా రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే అనే అంశంపై వ్యంగ్యంగా ట్వీట్ చేశానని, కానీ మరో ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వర్మ అన్నారు. మహాభారతంలో ద్రౌపది తన ఫెవరేట్ క్యారెక్టర్ అని, ఆ పేరు చాలా అరుదుగా కనిపిస్తుందని, అయితే ఆ పేరుతో సంబంధం ఉన్న కొన్ని క్యారెక్టర్లను గుర్తు చేసుకున్నానని, అందుకే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వర్మ తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే రీతిలో తాను కామెంట్ చేయలేదని వర్మ అన్నారు.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022
This was said just in an earnest irony and not intended in any other way ..Draupadi in Mahabharata is my faviourate character but Since the name is such a rarity I just remembered the associated characters and hence my expression. Not at all intended to hurt sentiments of anyone https://t.co/q9EZ5TcIIV
— Ram Gopal Varma (@RGVzoomin) June 24, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

