ఢీకొట్టేందుకు వెళ్లింది!

- అత్యంత క్లిష్టమైన ‘డార్ట్’ మిషన్
- తొలిదశ విజయవంతం
- కాలిఫోర్నియాలోని బేస్ నుంచి
- నింగిలోకి స్పేస్ఎక్స్ రాకెట్
వాషింగ్టన్, నవంబర్ 24: భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను తప్పించడానికి నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్’ తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘డిడిమోస్’ గ్రహశకల వ్యవస్థలోని ‘డిమార్ఫస్’ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం ఉదయం నింగిలోకి దూసుకుపోయింది. కాలిఫోర్నియాలోని వాండేన్బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ ఇందుకు వేదికైంది. ఈ మేరకు తొలిదశ విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. నిర్ణీత ఆస్టరాయిడ్ వేగాన్ని తగ్గించి, ప్రయాణ దిశను మార్చడమే ఈ టెస్ట్ మిషన్ ప్రధానోద్దేశం. ఈ ప్రయోగంలో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్, ప్రత్యేక లేజర్ కిరణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రోదసి చరిత్రలోనే అత్యంత క్లిష్ట ప్రయోగాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు.
మిషన్ పేరు: డార్ట్
ప్రయోగించిన సంస్థ: నాసా
ప్రయోగించిన రాకెట్: స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9
గ్రహశకలాన్ని ఢీకొట్టే సమయం: 2022 సెప్టెంబర్
ఢీకొట్టే సమయంలో రాకెట్ వేగం: గంటకు 24,000 కిలోమీటర్లు
ఢీకొట్టే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ బరువు:548 కిలోలు
‘డిమార్ఫస్’ గ్రహశకలం బరువు: 480 కోట్ల కిలోలు
ప్రయోగం ఖర్చు: 2,418 కోట్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

