Health tips | తరచూ పచ్చికొబ్బరి తింటే చాలా అనారోగ్యాలు పారిపోతాయ్ తెలుసా..?
Health tips : కొందరు పచ్చి కొబ్బరిని (Raw Coconut) చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో వేసుకునే చట్నీగా, తీపి వంటకంగా పచ్చి కొబ్బరిని వినియోగిస్తుంటారు. చక్కెరగానీ, బెల్లంగానీ కలుపుకుని కూడా తింటుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామని ఈ పచ్చి కొబ్బరిని దూరం పెడుతారు. కానీ నిపుణులైతే పచ్చి కొబ్బరితో లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నారు. పచ్చి కొబ్బరితో ఉండే ఆ లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Health tips : కొందరు పచ్చి కొబ్బరిని (Raw Coconut) చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో వేసుకునే చట్నీగా, తీపి వంటకంగా పచ్చి కొబ్బరిని వినియోగిస్తుంటారు. చక్కెరగానీ, బెల్లంగానీ కలుపుకుని కూడా తింటుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామని ఈ పచ్చి కొబ్బరిని దూరం పెడుతారు. కానీ నిపుణులైతే పచ్చి కొబ్బరితో లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నారు. పచ్చి కొబ్బరిని తరచూ తగిన మోతాదులో తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు. పచ్చి కొబ్బరి యాంటీ బయోటిక్‌గా పని చేస్తుందని, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు. పచ్చి కొబ్బరితో ఉండే ఆ లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి కొబ్బరితో లాభాలు..
రోగ నిరోధక శక్తి
పచ్చి కొబ్బరిని వీలైనప్పుడల్లా తింటూ ఉంటే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం తప్పుతుంది.
మంచి కొలెస్ట్రాల్
పచ్చి కొబ్బరిని తరచూ తీసుకోవడంవల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దాంతో రక్తంలో ఎలాంటి మలినాలు ఏర్పడవు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణ శక్తి
పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దాంతో జీర్ణ సమస్యలు కూడా త్వరగా రావు. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
అదుపులో థైరాయిడ్
చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతూంటారు. ఇలాంటి వారికి పచ్చి కొబ్బరి బాగా సాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్ ను తగ్గిస్తాయి.
మెదడు ఆరోగ్యం
తరచూ పచ్చి కొబ్బరి తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. అల్జీ మర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పిల్లల ఎదుగుదలకు
ఎదిగే పిల్లలకు పచ్చి కొబ్బరి చాలా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిలో వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దాంతో పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది. అలాగే చిన్న వయసులోనే ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. కావాల్సిన శక్తి లభిస్తుంది.
చర్మం, కేశాల ఆరోగ్యం
పచ్చి కొబ్బరి తరచూ తినడం వల్ల చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం కాంతివంతమవుతుంది. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. జుట్టు రాలడం ఆగిపోతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

