బ్లూ టీ గురించి మీకు తెలుసా..? దాంతో కలిగే లాభాలివే..!

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న అనేక మంది ప్రస్తుతం సాధారణ టీ లు కాకుండా హెర్బల్ టీ లు తాగుతున్నారు. వాటిల్లో మనకు అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పుడు బ్లూ టీ అని మరొక టీ కొత్తగా వచ్చి చేరింది. ఇంతకీ అసలు ఈ బ్లూ టీ అంటే ఏమిటి ? దాన్ని ఎలా తయారు చేస్తారు ? దాంతో కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూ టీ పౌడర్‌ను Clitoria ternatea అనే మొక్క పువ్వులను ఎండబెట్టి తయారు చేస్తారు. నిజానికి ఈ మొక్క మన చుట్టు పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. దీని పువ్వులను తెంచి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. అనంతరం ఆ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీంతో డికాషన్ తయారవుతుంది. దాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. రుచికి అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు.
బ్లూ టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మ సమస్యలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
మానసిక ప్రశాంతత కలుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
డయాబెటిస్ ఉన్నవారు బ్లూ టీ తాగితే మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

