Malavika Mohanan దక్షిణాదిలో హీరోయిన్లపై వివక్ష.. సినిమా ఫెయిల్ అయితే ఇంక అంతే: మాళవికా మోహనన్
దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కథానాయిక మాళవికా మోహనన్. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘యుధ్రా’లో ఈ భామ నటనకు ప్రశంసలు దక్కాయి.
దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కథానాయిక మాళవికా మోహనన్. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘యుధ్రా’లో ఈ భామ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘దక్షిణాదిలో హీరో కేంద్రంగానే సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతాయి. కథానాయికలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే ఆపాదిస్తారు. ఒకవేళ పరాజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్ను అన్‌లక్కీ అని, ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందని మాట్లాడతారు’ అని చెప్పింది.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి ‘రాజా సాబ్’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నది. ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, అభినయానికి ఆస్కారం ఉన్న మంచి పాత్ర ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

