ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం

సంగీత ప్రపంచంలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్. ఈయన పాడిన ప్రతీ పాట హిట్టే. తాజాగా విడుదలైన నితిన్ రంగ్ దే పాట కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించింది. అలాంటి గొప్ప గాయకుడికి ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం 10లో ఉన్న ఓ ప్రముఖ పబ్‌కు సిద్ శ్రీరామ్ వచ్చాడు. కొన్ని రోజుల కింద ఓ ఈవెంట్ కోసం వచ్చిన సిద్.. అక్కడ కార్యక్రమం అనంతరం చాలా మంది ప్రముఖులతో కలిసి పబ్ కు వచ్చాడు. అక్కడ ఆయనకు అవమానం జరిగిందని తెలుస్తోంది.
మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయీలు సిద్ శ్రీరామ్‌పై నీళ్లు, మద్యం విసిరి అవమానించారు. వాళ్లను వెంటనే గెట్ అవుట్ అంటూ సిద్ శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడున్న పబ్ యాజమాన్యం జోక్యం చేసుకుని గొడవను ఆపేసారని తెలిసింది. ఆ సంఘటన జరిగిన సమయంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటంతో విషయం పోలీసుల వరకు వెళ్లకుండా అడ్డకున్నారని.. అక్కడితో కాంప్రమైజ్ చేసారని ప్రచారం జరుగుతోంది. తనకు ఎదురైన ఈ అనుకోని సంఘటనతో సిద్ చాలా ఫీల్ అయ్యాడు. అందుకే తన ట్విట్టర్లో క్రమశిక్షణ గురించి ఓ పోస్ట్ చేసాడు. అన్నింటికంటే క్రమశిక్షణ అనేది ముఖ్యమంటూ ఈయన ట్వీట్ చేసాడు. అది ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు సిద్.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- nithiin
- rang de
- sid sriram
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

