సామాన్యుడి పోరాటాన్ని చూపించాం
“పెదకాపు’ కథను ఎప్పుడో రాసుకున్నా. 1980 దశకంలో వచ్చిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాల్పనిక అంశాలతో సాగుతుంది. ఈ కథకు మా నాన్న స్ఫూర్తినిచ్చారు’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
“పెదకాపు’ కథను ఎప్పుడో రాసుకున్నా. 1980 దశకంలో వచ్చిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాల్పనిక అంశాలతో సాగుతుంది. ఈ కథకు మా నాన్న స్ఫూర్తినిచ్చారు’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఏదైనా కొత్త పార్టీ వస్తుందంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందనే ఆశ ఉంటుంది. 80వ దశకంలో మా ఊరి రాజకీయల్లో నాన్న క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. కథ అనుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలనుకున్నా. ఇదొక వైవిధ్యమైన కథ. హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలో కులం ప్రస్తావన ఉండదు. టైటిల్ చూసి కొందరు అలా అనుకుంటున్నారు. పది మందిని కాపాడే వాడే పెదకాపు. ఆ ఉద్దేశ్యంలో టైటిల్ పెట్టాం.
ఫ్యామిలీ జోనర్ ఇష్టం
ఈ సినిమా కోసం హీరో విరాట్‌కర్ణ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సామాన్యుడి ప్రతినిధిగా తనదైన ఎమోషన్స్‌తో మెప్పించారు. ఇలాంటి జోనర్ సినిమాలు తీసి మెప్పించడం దర్శకులకు సవాలు వంటిది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన వారందరూ బాగుందని ప్రశంసించారు. స్వతహాగా నాకు ఫ్యామిలీ జోనర్ సినిమాలు ఇష్టం. సమాజంలో అత్యంత ముఖ్యమైనది కుటుంబమే. అందులోని భావోద్వేగాలను చూపించడం నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అన్ని జోనర్స్ సినిమాలు చేస్తా. తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్‌లో ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

