Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Diksha Divas | ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ (Icchoda) మండలం ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందుగానే దీక్షా దివస్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS chief KCR) 17 ఏళ్ల క్రితం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరు వేసుకుందామని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు.
Diksha Divas : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ (Icchoda) మండలం ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందుగానే దీక్షా దివస్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS chief KCR) 17 ఏళ్ల క్రితం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరు వేసుకుందామని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు. కేసీఆర్ 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి కేంద్రం మెడలు వంచిన రోజును దీక్షా దివస్‌గా జరుపుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇచ్చిన పిలుపు మేరకు.. ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందుగానే దీక్షా దివస్‌ను జరుపుకున్నారు.
ముఖ్రా (కె) గ్రామస్తులు ఎడ్లబండిపై కేసీఆర్ ఫోటో పెట్టుకుని, డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. కేసీఆర్ లేకుండా 300 ఏళ్లయినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తెలంగాణ సాధించే వరకు వెనకడుగు వేయని నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని, కేసీఆర్ తప్ప మరో నాయకుడు తెలంగాణను అభివృద్ధి చేయలేడని పేర్కొన్నారు.
దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినమని గ్రామస్తులు అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేదాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ల నాయకత్వంలో పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్రా (కె) గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
🔹 ఎడ్లబండిపై కేసీఆర్ గారి ఫోటో పెట్టి, కేసీఆర్ గారి చిత్రపటానికి పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ పాలాభిషేకం చేసిన ముఖ్రా (కె) రైతులు.
🔹 ముఖ్రా (కె) గ్రామంలో ముందస్తుగానే దీక్షా దివస్ ఉత్సవాలు ప్రారంభం.
🔹 దీక్షా దివస్ సందర్భంగా ఒకరోజు ముందే ముఖ్రా (కె) గ్రామంలో దీక్షా దివస్ ఉత్సవాలను గ్రామస్తులు ప్రారంభించారు.
17 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని, చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరు వేసుకుందామని వారు పేర్కొన్నారు. కేసీఆర్ గారు నవంబర్ 29, 2009న తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని ఒప్పించిన మహాఘట్టం దీక్షా దివస్ అని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు గ్రామంలో ముందస్తుగానే దీక్షా దివస్‌ను జరుపుకున్నారు.
ఎడ్లబండిపై కేసీఆర్ గారి ఫోటో పెట్టి, డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేస్తూ పాలాభిషేకం చేసిన ముఖ్రా (కె) గ్రామస్తులు, “కేసీఆర్ లేకుండా 300 యేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తెలంగాణ సాధించే వరకు వెనకడుగు వేయని నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని, కేసీఆర్ తప్ప మరో నాయకుడు తెలంగాణను అభివృద్ధి చేయలేడని, దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినమని అన్నారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, మళ్లీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే @AnilJadhav_brs గారి నాయకత్వంలో పార్టీ కోసం ఎల్లవేళలా పని చేస్తూనే ఉంటామని తెలిపారు. అనంతరం కేసీఆర్ చిత్రపటాన్ని ఎడ్లబండిపై పెట్టి డప్పులు వాయిస్తూ పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) November 28, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

