డీహెచ్లో ఇద్దరు ఏడీల హల్చల్!
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్) విభాగంలో ఇద్దరు అడిషనల్ డైరెక్టర్(ఏడీ)ల ఆగడాలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- మీడియాకు సమాచారం ఎవరు ఇస్తున్నారంటూ సిబ్బందికి బెదిరింపులు
- ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో ఉలికిపాటు
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్) విభాగంలో ఇద్దరు అడిషనల్ డైరెక్టర్(ఏడీ)ల ఆగడాలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇద్దరు అధికారులు సాగిస్తున్న అవినీతిపై నమస్తే తెలంగాణలో ‘ప్రతి ఫైలుకో రేట్ ఫిక్స్!’, ‘ఏవో టు ఏడీ పదోన్నతుల్లో గోల్మాల్!’ కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ కథనాలపై డీహెచ్లో పెద్ద చర్చ నడుస్తుండగా.. ఆ ఇద్దరు అధికారులు మాత్రం మీడియాకు తమ గురించి ఎవరు సమచారం ఇస్తున్నారనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఓ జాబితాను సిద్ధం చేసుకుని మరి మీడియాకు సమాచారం ఇస్తున్న వారిని వదిలేది లేదంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారట. ఆ ఇద్దరు ఏడీల్లో ఒకరు ఓ బీజేపీ ఎంపీకి దగ్గరి బంధువునని చెప్పుకొంటూ చెలామణి అవుతున్నట్టు తెలిసింది. తనపైనే మీడియాకు లీకులు ఇస్తారా..? అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

