Delta Variant : అక్కడ 80శాతం డెల్టా వేరియంట్ కేసులే..!
అక్కడ 80శాతం డెల్టా వేరియంట్ కేసులే..! | దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలింది. దాదాపు 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌గా గుర్తించారు. రాజధాని

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలింది. దాదాపు 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌గా గుర్తించారు. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక సమావేశంలో ఆరోగ్యశాఖకు పలు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 83.3 శాతం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గుర్తించినట్లు పేర్కొంది.
మేలో 81.7, జూన్‌లో 88.6, ఏప్రిల్‌లో 53.9 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) లో ఢిల్లీ నుంచి 5,752 శాంపిల్స్‌లో 1,689లో డెల్టా, 947 నమూనాలు ఆల్ఫా వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లిష్టమైన వేరియంట్లుగా వర్గీకరించింది. గతేడాది డిసెంబర్లో భారత్‌లో గుర్తించిన వేరియంట్ ఇప్పటికీ 95కిపైగా దేశాలకు పాకింది.
రెండో దశ ఉధృతికి డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని గుర్తించారు. లక్షలాది మంది జనం వేరియంట్ బారినపడగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ఫా వేరియంట్‌ను గతేడాది యూకేలో కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఢిల్లీలో కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 25,066కు పెరిగింది. 24 గంటల్లో ఒక్క మరణం నమోదుకాకపోవడం వారంలో ఇది మూడోసారి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

