డ్యాన్సింగ్ డాల్ ఇయర్రింగ్స్
షో కేస్‌కు సోకుతెచ్చే బుట్టబొమ్మలు అందాల భామల చెవులనూ అలంకరిస్తున్నాయి. భారతీయ నృత్యరీతులను ఇనుమడింపజేస్తూ.. సుకుమారి కర్ణాభరణమై హొయలొలికిస్తున్నాయి. ‘బుట్టబొమ్మ జుంకా’, ‘డ్యాన్సింగ్ డాల్ ఇయర్రింగ్స్' పేరిట నగల జాబితాలో కొలువుదీరుతున్నాయి.
షో కేస్‌కు సోకుతెచ్చే బుట్టబొమ్మలు అందాల భామల చెవులనూ అలంకరిస్తున్నాయి. భారతీయ నృత్యరీతులను ఇనుమడింపజేస్తూ.. సుకుమారి కర్ణాభరణమై హొయలొలికిస్తున్నాయి. ‘బుట్టబొమ్మ జుంకా’, ‘డ్యాన్సింగ్ డాల్ ఇయర్రింగ్స్’ పేరిట నగల జాబితాలో కొలువుదీరుతున్నాయి.
భారతీయ నృత్యరీతుల అందమే వేరు. అందులోనూ కూచిపూడి, భరతనాట్య భంగిమలు దేనికదే అద్భుతం. వాటిని ఒడిసిపట్టి, బంగారు బొమ్మలా తీర్చిదిద్ది జుంకాలుగా తయారు చేస్తున్నారు నగల డిజైనర్లు. పాదాలు, చేతులు, నడుము.. ఇలా సర్వాంగాలనూ పొందిగ్గా రూపొందిస్తున్నారు. ఒక్కో భంగిమను ఒక్కో డిజైన్‌లో పొందుపరుస్తున్నారు. వాటికి వజ్రాలు, పచ్చలు, కెంపులు చేరుస్తున్నారు. ముత్యాలు జత చేస్తున్నారు.
నడిచినప్పుడో, మాట్లాడినప్పుడో వయ్యారంగా ఊగుతూ.. కాంతి ప్రసరించిన ప్రతిసారీ తళుక్కున మెరుస్తాయీ జుంకాలు. అచ్చంగా పసిడినగలే కాకుండా బంగారు పూత పూసినవీ, ఫ్యాన్సీ రకాలు, ఆక్సిడైజ్డ్ మెటల్ తరహాలోనూ దొరుకుతున్నాయి. పుత్తడికి ఎనామిల్ రంగులద్ది మరీ ముస్తాబు చేస్తున్నారు. అంతేకాదు, పాశ్చాత్య నృత్య రీతుల్ని తలపించే డ్యాన్సింగ్ డాల్ చెవిపోగులూ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రకం జుంకాలు బుట్టబొమ్మల మనసుల్ని చుట్టేస్తున్నాయనే సంగతి ఇంకా చెప్పుకోవాలా..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

