e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News రాశి ఫలాలు 9.1.2022 నుంచి 15.1.2022 వరకు

రాశి ఫలాలు 9.1.2022 నుంచి 15.1.2022 వరకు

మేషం
ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తిచేస్తారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. పెట్టుబడులకు అనుకూల వారం. కొత్త వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురి ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్లాట్లు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్తవారితో జాగ్రత్త వహించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి.

వృషభం
నలుగురి సహకారం లభిస్తుంది. కుటుంబసభ్యులతో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు అనుకూల వారం. మంచి అవకాశాలు వస్తాయి. పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఓపికతో పనులు చేస్తారు. అనాలోచిత నిర్ణయాలతో భూ లావాదేవీల్లో చిక్కులు రావచ్చు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందడంతో, పనులు పూర్తికావడంలో ఆలస్యం జరుగుతుంది.

- Advertisement -

మిథునం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. విద్యార్థులకు అనుకూల వారం. ఆర్థిక సమస్యలతో కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పనిలో రాణిస్తారు. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది.

కర్కాటకం
ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనడంలో జాగ్రత్త పాటించండి. పాతబాకీలు వసూలు కావడంలో జాప్యం జరుగుతుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి.

సింహం
విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో అధికారులతో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వృథా ఖర్చులుంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధువర్గంతో పనులు నెరవేరినప్పటికీ, అనవసరమైన తగాదాలు ముందుకు రావచ్చు.

కన్య
కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనం అవసరం. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ పరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు.

తుల
ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటూ, పనులను పూర్తి చేసుకుంటారు. పదోన్నతి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. అనవసరమైన ఆలోచనలతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. పనులపై మనసు నిలపడం మంచిది. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

వృశ్చికం
పాతబాకీలు వసూలు అవుతాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. ఉద్యోగులకు అనుకూల వారం. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కొంత శ్రమించవలసి రావచ్చు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

ధనుస్సు
ఉద్యోగులకు ఆఫీసులో తోటివారితో స్నేహం పెరుగుతుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. విధి నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. శ్రమతో పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పెద్దల విషయంలో గౌరవంగా ఉంటారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అనవసరమైన తగాదాలు రావచ్చు. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.

మకరం
శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్త్ర, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. గౌరవ మర్యాదలను పొందుతారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పూర్వం పెట్టిన పెట్టుబడులకు ఫలితాలను పొందుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. కళాకారులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం.

కుంభం
కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒక పక్కన బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. అయితే వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో ముందుకు వెళ్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు న్యాయ సమస్యలు దూరమవుతాయి.

మీనం
పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉన్నా జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహిత్యవేత్తలకు, కళాకారులకు అనుకూలం. రాజకీయ పనులలో పురోగతి ఉంటుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పారిశ్రామిక వేత్తలకు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. దిగుబడితో సంతృప్తిని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement