మేషం
తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచించి పనులు చేస్తారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. పాత మిత్రులను కలుసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు.
వృషభం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. శుభకార్య నిర్వహణలో అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృథా ఖర్చులు ఎదురవుతాయి. వాహనం మరమ్మతులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పనిలో శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. సంగీత, సాహిత్య, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాబడి పెరుగుతుంది.
మిథునం
వివాహాది శుభకార్యాలు చేస్తారు. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగడంతో సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వారం.
కర్కాటకం
నలుగురి సాయంతో పనులు పూర్తవుతాయి. తలపెట్టిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాతబాకీలు కొంత వరకు వసూలు అవుతాయి. అనాలోచిత నిర్ణయాలతో పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. ముందుచూపుతో అడుగువేయండి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూమి కొనుగోలుపై మనసు నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉల్లాసంగా పనులు చేస్తారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది.
సింహం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగంలో చేరతారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారంపై మనసు నిలుపుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచన. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. శుభకార్యాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. భూలావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం.
కన్య
న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరిగినా, సంతోషంగా కాలం గడుపుతారు. ఆస్తి తగాదాలు ఎదురుకావచ్చు. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. మంచివారి మార్గదర్శనంతో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. పదోన్నతి, స్థాన చలన సూచన. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు శ్రమకు తగిన విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలం పొందుతారు.
తుల
పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రుల రాకతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఖర్చులను నియంత్రిస్తారు. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. డబ్బు తిరిగి చేతికి అందడంలో కొన్నిసార్లు వివాదాలు తలెత్తవచ్చును. ఒప్పందాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది.
వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన ఏర్పడుతుంది. అన్ని విషయాలను చర్చించి, అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం జరగవచ్చు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు కోసం ఆరాటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం, ఖర్చుల నియంత్రణ అవసరం. వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది.
ధనుస్సు
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఉల్లాసంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. వ్యాపారులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. పాత బాకీలు వసూలు కావడంలో వివాదాలు తలెత్తవచ్చు. ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నలుగురితో చర్చించి నిర్ణయం తీసుకోండి.
మకరం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం. వృథా ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో వాళ్లతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం. నలుగురిలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. ఆస్తుల విషయంలో వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు.
కుంభం
ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వృథా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సంబంధాలు పెరుగుతాయి. అధికారుల విమర్శలతో ఇబ్బందులు రావచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు అన్ని వర్గాల సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. మంచివారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, విందులు, వినోదాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సమయాన్ని వెచ్చిస్తారు. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. పెద్దల విషయంలో భక్తి భావనతో ఉంటారు. ఇంటా బయటా వాతావరణం ఆనందంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో స్థానచలనం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in