మేషం
ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వృథా ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
వృషభం
స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సంగీత, సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పని భారం పెరిగినా, పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూమి కొనుగోలు వాయిదా పడుతుంది. వాహనాల మరమ్మతులు ముందుకు వస్తాయి. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడతారు.
మిథునం
విద్యార్థులకు అనుకూల వారం. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, విందులకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి, వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసివస్తుంది.
కర్కాటకం
ప్రారంభించిన పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాలతో కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు. ఓపికతో పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. వృథా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పనులపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. భూములు, వాహనాల మూలంగా పనులు అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి.
సింహం
పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మంచి సంస్థలలో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. పదోన్నతి, అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. నాయకుల అండదండలు లభిస్తాయి.
కన్య
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగుపొరుగు వారితో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భూములు, వాహనాల కొనుగోలులో ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్త వహించాలి. పనులను ఓపికతో నిర్వర్తిస్తారు. ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు.
తుల
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. వృథా ఖర్చులు నియంత్రించుకుంటే ఈ వారం బాగా కలిసివస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి, అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఆలోచనలతో మనస్తాపం కలుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.
ధనుస్సు
ప్రయాణాలు కలిసివస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించండి. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మకరం
శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆస్తుల విషయంలో సోదరవర్గంతో విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కోర్టు పనులలో సానుకూలత ఉంటుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది.
మీనం
రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు వంటి పనులు విజయవంతంగా ముందుకుసాగుతాయి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in